హ్యాపీగా…అల్లు ఫ్యామిలీ …

Allu-Arjun-Enjoying-Vacation-With-His-Family
Allu-Arjun-Enjoying-Vacation-With-His-Family

అల్లు అర్జున్ టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలతో బన్నీ చాలా టైం స్పెండ్ చేసేందుకు ఇష్టపడతాడు. తరుచుగా ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉండే అల్లు అర్జున్ మరోసారి భార్య పిల్లలతో కలిసి సరదాగా సిట్జర్లాండ్ కు వెళ్లాడు. పిల్లలతో ఎప్పటికప్పుడు ఫారిన్ టూర్స్ వెళ్లే అర్జున్ ను ఆయన అభిమానులు మరియు నెటిజన్స్ ఆదర్శనీయమైన తండ్రి మరియు భర్త అంటూ అభినందిస్తూ ఉంటారు.
తాజాగా అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో భార్య పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ను పోస్ట్ చేశాడు. లైఫ్ లో ఇలా ఉండాలి – హ్యాపీగా అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. సిట్జర్లాండ్ లోని అందమైన ప్రదేశాల్లో – మారుమూల ప్రాంతాల్లో బన్నీ అండ్ ఫ్యామిలీ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫొటోలను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ ఫొటోలకు సైతం నెటిజన్స్ నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మీరు ఆదర్శనీయమైన తండ్రి మరియు భర్త మీ నుండి చాలా ఇతరులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.