స్పైస్‌ 2000 బాంబులను కొనుగోలు చేయనున్న వైమానికం!

spice 2000 bomb
spice 2000 bomb


న్యూఢిల్లీ: శత్రువుల స్థావరాలను, బంకర్‌లను ధ్వంసం చేసే స్పైస్‌ 2000 అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌ బాంబులను భారతీయ వైమానికి దళం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇటీవల పాక్‌ స్థావరాలపై భారత వైమానికి దళం వదిలిన బాంబులు ఇవే. స్పైస్‌ 2000 బాంబులు, కాంక్రీట్‌ రూఫ్‌టాప్‌లను కూడా చేధించి..బిల్డింగ్‌లను పూర్తిగా ధ్వంసం చేయగలవు. బిల్డింగ్‌ డెస్ట్రాయర్‌ లేదా బంకర్‌ బస్టర్‌గా పిలువబడే మార్క్‌ 84 వర్షన్‌ బాంబులను కొనేందుకు వైమానికి దళం ఆసక్తి కనబరుస్తున్నది. అత్యవసర అధికారాలను వినియోగించుకుని సుమారు మూడు వందల కోట్ల విలువైన బాంబులను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌ నుంచి ఈ బాంబులను ఖరీదు చేయనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/