రసెల్‌ ఆటతీరుపై హేల్స్‌ అసంతృప్తి

alex hales, Andre Russell
alex hales, Andre Russell


చెన్నై: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఆల్‌రైండర్‌ ఆండ్రీ రసెల్‌ ఆటతీరును అలెక్స్‌ హేల్స్‌ తపుబట్టాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ఐన హేల్స్‌ గతంలో ముంబై ఇండియన్స్‌కు, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మంగళవారం రాత్రి జరిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 79 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి గర్నీతో పాటు రసెల్‌ వచ్చి స్కోరును 108కి పెంచారు. ఐతే చాలాసార్లు సింగిల్‌ తీసే అవకాశం వచ్చింది. దీంతో రసెల్‌ ఆటతీరుపై అలెక్స్‌ హేల్స్‌ ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో రసెల్‌ అర్థసెంచరీతో ఒంటరి పోరాటం చేసినా కోల్‌కత్తాను గెలిపించలేకపోయాడు. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరింగ్‌ మ్యాచ్‌ల్లో ప్రతి పరుగూ కీలకమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని హేల్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos