4 గురు పోతే 40వేల మంది త‌యార‌వుతారు

alapati raja
alapati raja, ex minister

గుంటూరు: నలుగురు ఎంపీలు పార్టీ మారినంత మాత్రాన టిడిపికు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) అన్నారు. బిజెపిలో చేరిన నలుగురు ఎంపీలూ ఎన్నికల్లో పోటీచేసే ధైర్యంలేని వ్యక్తులని, వారికి రాష్ట్ర ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎన్నో సంక్షోభాలను చూసిన టిడిపికు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పెద్ద సమస్యేమీ కాదన్నారు. తనకు తెలిసి ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారడంలేదని చెప్పారు. పార్టీలో తాజా పరిణామాలపై గుంటూరులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడుతూ.. టిడిపి నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులు తయారవుతారని వ్యాఖ్యానించారు.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/