అజంగఢ్‌ నుంచి అఖిలేష్‌, కనౌజ్‌ నుంచి భార్య

akhilesh yadav, dimple yadav
akhilesh yadav, dimple yadav


లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పి) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. ఈ స్థానానికి పోలింగ్‌ ప్రక్రియ మే 12న జరగనుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొయిన్‌పూరి నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి ములాయం పోటీ చేయనున్నట్లు ఇటీవలే ఎస్పీ తొలి జాబితాలో ప్రకటించారు. అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కనౌజ్‌ నుంచి బరిలో ఉండనున్నారు. మొయిన్‌పూరిలో ఏప్రిల్‌ 23న, కనౌజ్‌లో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్నాయి. అఖిలేష్‌ తీవ్ర కసరత్తు చేసి అజంగఢ్‌ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తునన స్థానం కావడం, ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్‌ అజంగఢ్‌ను ఎంపిక చేసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బిఎస్పీ-ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న విషయం అందరికీ విదితమే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/