ట్రెహాన్‌లో కుప్పకూలిన విమానం

180 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఉక్రెయిన్ కు చెందిన విమానం

Ukrainian Airlines plane
Ukrainian Airlines plane

ఇరాన్‌: ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం
టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం అందింది. అందులో ఉన్న అందరూ చనిపోయారా? ఎవరైనా బతికి ఉన్నారా? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విమానాన్ని అమెరికానే కూల్చి వేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటోందని, ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని, తమ రాడార్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/