జెట్‌ విమానాలను లీజుకు అడుగుతున్న ఎయిర్‌ఇండియా

jet airways
jet airways

ముంబై: జెట్‌ విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా ఆ విమానాలను తమకు లీజ్‌కివ్వాలని ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌ అశ్విని లోహాని ఎస్‌బిఐ ఛైర్మన్‌ రజనీష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఐతే జెట్‌ ఎయిర్‌వేస్‌ దగ్గర ఇప్పుడు 16 అతి భారీ విమానాలున్నాయి. వాటిలో బోయింగ్‌కు 777-300 ఈఆర్‌ విమానాలు 10 ఉంటే మిగిలిన ఆరు ఎయిర్‌బస్‌కు చెందిన ఏ 330 ఎస్‌ విమానాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 5 బోయింగ్‌ విమానాలను తమకు లీజుకిస్తే అంతర్జాతీయ రూట్లలో నడుపుతామనిలేఖలో కోరారు. ఈ విషయంపై రజనీష్‌ను ఈ రోజు లోహాని నేరుగా కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. కాగా బుధవారం నుంచి జెట్‌ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పడు ఆ విమానాలన్నీ ఖాళీగానే ఉన్న తరుణంలో వాటిని ఉపయోగించుకునేందుకు లోహాని ఎస్‌బిఐ రజనీష్‌కు లేఖ రాశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/