ఇండోనేషియాలో మరోసారి భూకంపం

indonesia earthquake
indonesia earthquakeజకార్తా, సెప్టెంబరు26: ఇండోనేషియా సీరం దీవుల్లో 29.9 కిలోమీరట్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియాలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 6.5గా నమోదయింది. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని అమెరికా జియాలాజికల్‌ సర్వే శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. 2004, 2018లో వచ్చిన భూకంపాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిందన్నారు. పసిఫిక్‌ సముద్రం పరిధిలోని ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల నుంచి లావా వెదజల్లటం చేస్తుంటాయి. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన ప్రకారం అంబాన్‌లో దాదాపు 40 కిలోమీటర్ల మేర బ్రిడ్జి స్వల్పంగా దెబ్బ తిన్నది. అదేవిధంగా అన్షార్‌ ఇస్లాం బోర్డింగ్‌ పాఠశాలలో భూకంపం ధాటికి నేల, కుర్చీలు కదిలాయి. అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇండోనేషియాలో భూకంపం అనగానే సాధారణంగా సునామి భయం ఏర్పడుతోంది. అయితే ఈ సారి భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్నా సునామీకి అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేసారు. దీని ప్రభావం ఎలా ఉందన్న అంశం మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చి భూకంపొం కారణంగా హిందూ మహాసముద్రంలో సునామి ఏర్పడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/