ఆఫ్ఘన్‌ జట్టుకు షాక్‌..షాజాద్‌ నిష్క్రమణ

Mohammad Shahzad
Mohammad Shahzad

లండన్‌: వన్డే ప్రపంచకప్‌లో విజయం కోసం పోరాడుతున్న ఆఫ్ఘన్‌ జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. ఆ జట్టు బిగ్‌ హిట్టింగ్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షాజాద్‌ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పాక్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా అతని మోకాలికి దెబ్బ తగిలింది. ఆ నొప్పితోనే ఆస్ట్రేలియా, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాడు.
టోర్నీలో షాబాజ్‌ లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఓపెనర్‌గా బరిలో దిగే షాజాద్‌ చాలా వేగంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. కొన్ని మ్యాచుల్లో విఫలమైనా చాలా మ్యాచుల్లో అతడు మెరుగ్గా రాణించాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/