నేవీ చీఫ్‌గా కరంబీర్‌ సింగ్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత నావికాదళ చీఫ్‌గా అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అడ్మిరల సునీల్‌ లాంబాను నుంచి కరంబీర్‌ బాధ్యతలు స్వీకరించారు. 24వ నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్‌ తెలిపారు. భారత నౌకాదళాన్ని లాంబా ఎంతో పటిష్టం చేశారని కరంబీర్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/