యురేనియం తవ్వకాలపై నిరసన

Actress Samantha

Actress Samantha

Hyderabad: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్ కథానాయిక సమంత అక్కినేని నిరసన గళం వినిపించారు. ఇప్పటికే పలువురు సినీ తారలు యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో సమంత కూడా వారితో గొంతు కలిపారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలని భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్లమలలో తవ్వకాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై తాను సంతకం చేశానని, తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని కోరారు. తవ్వకాలను ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటులు విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, సాయి ధరమ్ తేజ్, యాంకర్ అనసూయ తదితరులు వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.