రెడ్ హాట్ బ్యూటీ.. స్ట్రాబెర్రీ

Actress Rashmika Mandanna
Actress Rashmika Mandanna

రష్మిక అఫిషియల్ ఖాతాతో పాటుగా ఫ్యాన్స్ కూడా లెక్కలేనన్ని ఎకౌంట్లు మెయింటెయిన్ చేస్తుంటారు. అందులో ఎక్కువ ఫాలోయర్స్ ఉండే ఒక ఖాతా ద్వారా అభిమానులు తమ ఆరాధ్యదేవత ఫోటో ఒకటి పోస్ట్ చేశారు.  ఆ ఫోటోలో రష్మిక రెడ్ కలర్ టాప్ ధరించి పోజిచ్చింది.  లూజ్ హెయిర్.. మినిమమ్ మేకప్ తో కనిపించిన రష్మిక ఓ బ్రైట్ స్మైల్ ఇచ్చింది.  అసలే రష్మిక అంటే పడిచచ్చిపోతున్న ఫ్యాన్స్ ఇలాంటి ఫోటోను చూస్తే ఊరుకుంటారా?  లైకులతో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఒకరు రెడ్ హాట్ బ్యూటీ అంటే.. మరొకరు స్ట్రాబెర్రీ అన్నారు. ఇంకొకరు లేడీ కామ్రేడ్ కు వందనాలు చెప్పారు.  ఆ అభిమాని రష్మికను లేడీ కామ్రేడ్ అన్నారో అర్థం అయింది కదా?  గీత మేడమ్ ప్రస్తుతం గోవిందం సారుతో కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తోంది.