జిల్ మనిపిస్తున్న జిగేల్ రాణి!

Actress Pooja Hegde
Actress Pooja Hegde

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్న భామల్లో అందాల బొమ్మ పూజా హెగ్డే ఒకరు.  ఈమధ్య రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్హి’ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. హిందీ.. తెలుగులో సినిమాలతో బిజీగా ఉన్నా ఈ భామ రీసెంట్ గా జీక్యూ మ్యాగజైన్ వారు నిర్వహించిన ‘జీక్యూస్ 100 బెస్ట్ డ్రెస్డ్’ కార్యక్రమానికి హాజరైంది.  ఏదో సాదాసీదా అత్తెసరు కార్యక్రమాలకే సూపర్ డ్రెస్సుల్లో వస్తుంది ఈ భామ.  బెస్ట్ డ్రెస్ లు వేసుకొచ్చే కార్యక్రమం కావడంతో కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక శాటిన్ డ్రెస్ లో మెరిసింది పూజా.  స్లీవ్ లెస్ టాప్ వేసుకుంది కానీ దానికి ఫ్రంట్ ఓపెన్ విండో ఉంది.   ఎండాకాలం కావడంతో చక్కగా గాలి ఆడేందుకు ఆ డిజైనర్ ఇలా పని కానిచ్చినట్టున్నాడు. సహజంగా ఇలాంటి టాప్స్ డిజైన్ చేసిన సమయంలో మెడదగ్గర కాలర్ డిజైన్ ఉండదు.  ఈ డ్రెస్ కు మాత్రం మెడకు నెక్లెస్ లాగా వచ్చింది.  ఇక బాటమ్ కూడా అదే క్లాత్.. అదే కలర్ లో ఆకర్షణీయంగా డిజైన్ చేయడంతో పూజ అందాల భామలాగా మెరిసిపోతోంది.  ఆభరణాలు అసలేమాత్రం ధరించకుండా.. మినిమమ్ మేకప్ తో నడుము మీద చేతులు పెట్టుకొని స్టైల్ గా నిలబడింది.  ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అతిథుల కళ్ళన్నీ పూజ మీదకే వెళ్ళిఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.  

పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా.  ఇది కాకుండా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.