బిగ్‌బాస్‌ 3 సీజన్‌కి హోస్ట్‌గా నాగార్జున!

nagarjuna
nagarjuna

తెలుగులో రెండు సీజన్స్‌లోను బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్‌ బాస్‌, తెలుగులో తొలి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఒక మూడో సీజన్‌ 3 ఎప్పుడు మొదలవుతుందా, హోస్ట్‌ ఎవరు అనే దానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం మీలో కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే బిగ్‌బాస్‌ 3ని హోస్ట్‌ చేయనున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని గత సీజన్‌లో పాల్గొన్న సామ్రాట్‌..ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్‌ ప్రకటన కూడా చేయనున్నారట. జూలైలో ఈ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ,నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌లో బిజీగా ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/