హక్కుల కార్యకర్తపై దేశద్రోహనేరం కేసు

shehla rashid
shehla rashid


న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త షీలారషీద్‌పై దేశద్రోహనేరం నమోదుచేసారు. దేశరపజలమధ్య శతృత్వాన్ని రెచ్చగొడుతున్నారని విద్వేషపూరిత వైఖరి అనుసరిస్తున్న ఆమెను దేశద్రోహం నేరంకిందఅరెస్టుచేయాలన్న ఫిర్యాదులపై షీలారషీద్‌పై కేసునమోదుచేసారు.జమ్ముకాశ్మీర్‌లో 370వ అధికరనం రద్దయిన తర్వాత మొట్టమొదటి దేశద్రోహంనేరం కేసు షీలారషీద్‌పై ఢిల్లీపోలీసులు నమోదుచేసారు. తిలక్‌మార్గ్‌పోలీస్‌స్టేషన్‌లో ఒక న్యాయవాది చేసిన ఫిర్యాదుమేరకు ఆమెపైకేసునమోదుచేసారు. ఐపిపి సెక్షన్‌ 124-ఎ, 153-ఎ విభిన్న గ్రూపలు మతాలమధ్య విద్వేషాగ్ని రగల్చడం, జన్మస్థలం, నివాసం, భాష వంటివాటిపై విద్వేషపూరిత వ్యాఖ్యలుచేయడం వంటి సెక్షన్లు నమోదుచేసారు. కేసునమోదుచేసిన తర్వాత ఢిల్లీపోలీసులు ఎప్‌ఐఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు విభాగానికి బదలాయించారు. ఎక్కువశాతం ఫిర్యాదులన్నీ ఆగస్టు 18వ తేదీ తర్వాతనే నమోదయ్యాయి.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/