అమీర్‌ మేకప్‌ వైరల్‌

amir khan
amir khan


బాలీవుడ్‌ స్టార్‌హీరో అమీర్‌ఖాన్‌కు మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అని పేరుంది.. ఏ పాత్ర టేకప్‌ చేసినా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తారు.. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనవైపు నుండి వందశాతం ఎఫర్ట్స్‌ పెడతారాయన. అందుకే అమీర్‌ఖాన్‌ ఏ ప్రాజెక్టును సైన్‌ చేసినా అది వెంటనే క్రేజీగా మారిపోతుది.. ఆయన లుక్స్‌్‌, గెటప్స్‌ విషయాల్లో చేసే ప్రయోగాలకు అసలు లెక్కే ఉండదు.. తాజాగా అమీర్‌ ఒక కొత్తలుక్‌లో అందరినీ షాక్‌కు గురిచేశారు..తాజాగా తన సోషల్‌ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్‌చేశారు.. ఆ వీడియోలో సాధారణంగా ఉన్న అమీర్‌ను మేకప్‌ సాయంతో ఒక వయసు పైబడిన వ్యక్తిగా మార్చటం ఉంది.. సగం బట్టతల, మిగతా సగం తెల్లటి జుట్టు, మీసాలతో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అమీర్‌.. ఈ వీడియోకు ‘కమింగ్‌ సూన్‌.. ఆప్‌కే ఫోన్‌ పే
అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.. ఓ యాప్‌కు అమీర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా డీల్‌ కుదుర్చుకున్నారు.. ఈ బ్రాండ్‌ యాడ్‌ షూటింగ్‌ కోసం ఇలా గెటప్‌ మార్చారు.. ఈ గెటప్‌కు నెటిజన్ల నుంచి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos