అమీర్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

amir khan
amir khan

ముంబై: ఇండిగోకు చెందిన విమానంలో ఎకానమీ క్లాసులో బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ ప్రయాణించాడు. సాధారణంగా సెలబ్రిటీలు బిజినెస్‌ క్లాసులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఐతే అమీర్‌ఖాన్‌ మాత్రం ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో నవ్వుతూ కూర్చున్నాడు. ఆ సందర్భంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ వీడియో తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు..అమీర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. అమీర్‌ భా§్‌ు నువ్వు రియల్‌ హీరో అంటూ ఆయన్ను ప్రశంసించారు. త్వరలో అమీర్‌ లాల్‌ సింగ్‌ చద్దా అనే చిత్రంలో నటించబోతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/