కరాచీ విమాన ప్రమాదంలో 97 మంది మృతి

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు

plane crashes near Karachi airport

కరాచీ: పాకిస్థాన్‌ కరాచీలోని ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో మొత్తం 97 మంది మృతి చెందారు. జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 97 మంది మరణించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, విమానం జనావాస ప్రాంతాల్లో కుప్పకూలడంతో స్థానికుల్లో చాలామంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సందర్భంగా పురుషులు ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లడంతో ఇంటి పట్టున ఉన్న మహిళలు ఎక్కువ మంది గాయపడ్డారు. మృతుల్లో చాలామంది ప్రయాణికులు సీటు బెల్టు ధరించే ఉన్నారని అధికారులు తెలిపారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/