9న నిరసనదీక్ష విరమణ

ladyfff

9న నిరసనదీక్ష విరమణ

న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త, ఐరన్‌లేడీ ఇరామ్‌ చాను షర్మిల 16 సంవత్సరాలుగా చేస్తున్న నిరసన దీక్షను ఆగస్టు 9వ తేదీన విమరించనున్నారు.. ప్రభుత్వం సానుకూలంగా స్పందన కనబర్చటం లేదని, దీక్ష విరమించి సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో పోటీచేస్తానని షర్మిల ప్రకటించారు. కాగా ఆర్మీ ప్రత్యేకాధికారుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ 2000 సంవత్సరం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు.. కాగా ఆత్మాహత్యాయత్నం కేసు కింద పలుమార్లు అరెస్టు చేసి జైలులో ఉంచి, విడుదల చేస్తూ వచ్చారు.