భారత సైనికుల సిక్‌లీవులపై తప్పుడు ప్రచారం!

అందులో నిజం లేదని తెలిపిన పీఐబీ

One Indian Army

న్యూఢిల్లీ: వేలాది మంది భారతీయ సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని పేర్కొంటూ, సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర స్పందించింది. ఆ వార్తలని అవాస్తమని ప్రభుత్వం ప్రకటించింది. లడఖ్‌ కేంద్రంగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు, కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో తొలిసారి భారత్‌కు చెందిన 80,000 మందికి పైగా సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తు చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ఓ తప్పుడు వార్తను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) పోస్ట్ చేసి, అందులో నిజం లేదని తెలిపింది. మన సైనికులు సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా తెలిపాయి. ఇటువంటి అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నాయి. కాగా, ఎన్నడూ లేని విధంగా భారత్‌చైనా సరిహద్దుల వద్ద గల్వాన్‌ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోంది.

pib gives clarity on indian army leaves


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/