8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32ఎకరాలు

NARAYANA
NARAYANA

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32ఎకరాలు : మంత్రి నారాయణ

అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8జాతీయ,అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం 32ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీసెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామన్నారు.