ఇటలీలో మరణ మృదంగం . ..627 మంది మృతి

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ

Coronavirus cases in Italy
Coronavirus cases in Italy

జెనీవా :కరోనా వైరస్ ఇటలీలో కల్లోలం రేపుతోంది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏకంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,032కి చేరుకుంది. ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, కరోనా మరణాల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఆ దేశానికి పెను సవాల్ గా నిలిచింది. పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో… ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/