మసీదుల్లో కాల్పులు.. 50మంది మృతి

newzealand mosque shootings
newzealand mosque shootings


హైదరాబాద్‌: న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మృతుల సంఖ్య 50 కి చేరింది. ఇవాళ ఉదయం క్రైస్ట్‌ చర్చ్‌లో రెండు మసీదుల వద్ద కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాల్పులకు కారణం ఆస్ట్రేలియా వాసే జరిపాడు. ఈ కాల్పుల్లో దాదాపు 50 మంది గాయపడ్డారు. సెమీ ఆటోమేటిక్‌ వెపన్‌తో డీన్స్‌ మసీదులోకి వచ్చిన అతను విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. లిన్‌వుడ్‌ ప్రాంతంలో ఉన్న మరో మసీదులో కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో మరో నలుగుర్ని అరెస్టు చేశారు. ఐతే వీరిలో ఎవరూ కూడా అనుమానిత ఉగ్రవాద జాబితాలో లేరు. న్యూజిలాండ్‌ చరిత్రలో ఇది చీకటిరోజు అని ప్రధాని జెపిండె ఆర్డెన్‌ తెలిపారు. మరోవైపు న్యూజిలాండ్‌లోని ముస్లిం సంఘాలు రక్కదాతల కోసం పిలుపునిచ్చారు. న్యూజిలాండ్‌ జాతీయ జెండాను పార్లమెంటు వద్ద అవనతం చేశారు.