4,300కు చేరిన కరోనా మృతులు

115 దేశాల్లో వ్యాపించిన కరోన వైరస్‌

coronavirus
coronavirus

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ చైనాలోని వ్యూహాన్‌ నగరంలో పుట్టిన ఈవైరస్‌ ప్రపంచంలోని 115 దేశాల్లో విస్తరించింది. దీంతో 4,300 మంది మృతి చెందారు. అంతేకాక ఈవైరస్‌ బాధితుల సంఖ్య 8వేలకు చేరింది. ఈయూ దేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంపై ఇటలీలో జన సంచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీలో ఎవరైన ఆంక్షలను ఉల్లంఘిస్తే శిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే.. దేశవ్యాప్తంగా నిన్నకి వరకు 14 కేసులు నమోదు కాగా.. ఇప్పటికి వరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 61కి చేరింది. కేరళలో 14 కేసుులు, కర్ణాట, మహారాష్ట్రలో 3 చొప్పున కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో ఇప్పటి వరకు 50 కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్రం కరోనా వైరస్ దృష్ట్యా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశస్థుల రాకపై ఆంక్షలు విధిస్తూ.. రెగ్యులర్, ఈ వీసాలను రద్దు చేసింది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 24కు చేరగా.. ట్రంప్ కు కరోనా ఉందన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించి ట్రంప్ ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదన్న అధికారులు క్లారిటీ ఇచ్చారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/