మెదడువాపుతో 36 మంది చిన్నారులు మృతి

children hospitalised
children hospitalised


ముజఫర్‌పూర్‌: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి సంబంధిత లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృతి చెందారు. విపరీత జ్వరం, ఇతర లక్షణాలతో మరో 100 మంది పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువమంది తీవ్ర జ్వరం, హైపోగ్లైసీమియా(రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోవడం) లక్షణాలున్నవారేనని ముజఫర్‌ నగర్‌ సివిల్‌ సర్జన్‌ ఎస్పీ సింగ్‌ తెలిపారు. చిన్నారుల్లో కొంతమంది కేజ్రీవాల్‌ ఆస్పత్రిలో మరికొందరు శ్రీ కృష్ట మెమోరియల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/