32 పార్టీల విరాళాలు రూ.221.48 కోట్లు

FUNDS
FUNDS

32 పార్టీల విరాళాలు రూ.221.48 కోట్లు

అగ్రస్థానంలో తమిళనాడు   3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 32 రాజకీయ పార్టీలు 2015-16 ఆర్ధికసంవత్స రంలో 221.48 కోట్ల రూపాయలు విరాళా లుగా సమకూర్చుకున్నాయి. వీటిలో తమిళ నాడుకు చెందిన పార్టీలు అగ్రస్థానంలో ఉన్నాయి. డిఎంకె రూ.77.63 కోట్లు, ప్రత్యర్ధిపార్టీ ఎఐఎడిఎంకె రూ.54.93 కోట్లతో పోటీపడ్డాయి. ఇక మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రూ.15.97 కోట్లు సమకూర్చుకోగలిగింది. డిఎంకె, ఎఐఎడిఎంకె అఖిలభారత మజ్లిస్‌ ఇత్తేహాలుదల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం) పార్టీలు మూడు కూడా సేకరించిన విరాళాల్లో 80శాతానికి మించిఖర్చుకచేయలేదు. డిఎంకె పార్టీ కేవలం రూ.6.9కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఎఐఎడిఎంకె రూ.7.09 కోట్లు ఖర్చుచేసింది.