వాయుకాలుష్యంతో ఏటా మూడు వేల కోట్ల డాలర్ల నష్టం!

stubble burning
stubble burning


న్యూఢిల్లీ: దేశరాజధాని పరిసరాల్లోని మూడురాష్ట్రాల్లో నూర్పిళ్లు పూర్తి అయిన తర్వాత వరిదుబ్బులను దగ్ధంచేయడం వల్ల వాయుకాలుష్యం చెలరేగి సాలీనా మూడువేల కోట్ల డాలర్లు నష్టం వాటిల్లుతున్నదని సర్వేసంస్థలు అంచనావేసాయి. అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ఆహార విధివిధానాలపరిశోధనా సంస్థ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) ఇతర భాగస్వామ్య సంస్థలు నిర్వహించిన సర్వేలో భారీ ఎత్తున వాయుకాలుష్యం వెదజల్లుతున్నదని తేలింది.వరిపంటపొలాల్లో నూర్పిడి జరిగిన తర్వాత వరిదుబ్బులను తగులబెట్టడం వల్ల భారీ ఎత్తున నష్టం వాటిల్లుతున్నట్లు తేలింది. ప్రత్యేకించి ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు శ్వాసకోశవ్యాధులు ప్రభలిపోతున్నాయి. పంటపొలాల్లోవరిదుబ్బులు తగులబెట్టడంవల్ల మొట్టమొదటిసారిగా కేవలం ఉత్తరభారత్‌లోనే సాలీనా మూడువేల కోట్లు నష్టం వస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ప్రజారోగ్య సంస్థ అంచనాలనుచూసినా వాయుఆధారిత కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయని, ప్రత్యేకించి ఢిల్లీలో 20రెట్లు అధికంగా కాలుష్యం ఉందని, కాలుష్యకారకాలవల్ల ఆరోగ్యం దేశరాజధానిలో 20 రెట్లు దెబ్బతింటున్నట్లు వెల్లడించింది. అదే భారతీయ కరెన్సీలపరంగాచూస్తే ఏడాదికి రెండులక్షలకోట్లు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనావేసింది. ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింతగోరంగా ఉంది. అంతర్జాతీయ జర్నల్‌లోసైతం వీటినిప్రచురించిన అద్యయన వేదికలో ఈ మూడురాష్ట్రాల్లోని సుమారు 2.50లక్షలమంది ఆరోగ్యపరిస్థితి ఊపిరితిత్తులవ్యాధులు ఎక్కువ ఉన్నట్లు గుర్తించింది.