నైజీరియా ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి

suicide bombing
suicide bombing

కనో: నైజీరియాలో బొకొహరాం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీలో అందరూ గుంపులుగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము పేల్చేసుకున్నారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/