281కి చేరిన ఇండోనేషియా సునామీ మృతులు

tsunami kills hundreds of people
tsunami kills hundreds of people

జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవడంతో సంభవించిన సునామీ వల్ల ఇప్పటి వరకు 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మరో 28 మంది గల్లంతయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.