వాయు తుపాన్‌పై అమిత్‌షా సమీక్ష

 Cyclone Vayu:  relief work.
Cyclone Vayu: relief work.

New Delhi: వాయు తుపాన్‌ కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు సన్నద్ధమయ్యాయనే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి
అమిత్‌షా అధికారులతో సమావేశమై సమీక్షించారు. తుపాన్‌ తాకిడికి గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమిత్‌షా అధికారులను ఆదేశించారు. అలాగే కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలూ పని చేసేలా చూడాలని, కోస్‌గార్డ్‌, నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలకు చెందిన సిబ్బందిని అప్రమత్తం చేసి సిద్ధంగా ఉంచామని ఆయన అన్నారు. నిఘా విమానాలను రంగంలోకి దింపామని ఆయన చెప్పారు.