21, 26 తేదీల్లో బ్యాంకుల సమ్మె

UFBO
UFBO

హైదరాబాద్‌: ఈనెల 24వ తేదీ మినహా 21వ తేదీ నుండి 26వ తేదీ వరకూ బ్యాంకులు మూతపడనున్నాయి. ఆలిండియా బ్యాంకు ఆఫీసర్ల సంఘం (ఏఐబీఓసీ) ఈనెల 21వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చింది. 22వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవుకాగా, 23 ఆదివారం, 24వ తేదీ ఒక్క రోజు బ్యాంకులు పనిచేయనుండగా, 25వ తేదీన క్రిస్మస్‌ సెలవు, మళ్లీ 26వ తేదీన యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్‌ (యు ఎఫ్‌బీవో) సమ్మెకు పిలుపునిచ్చింది. విజయాబ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతిపాదిత విలీనానిన వ్యతిరేకిస్తూ ఈనెల 26వ తేదీన సమ్మె తలపెట్టినట్లు బ్యాంకు యూనియన్లు వారం క్రితమే ప్రకటించాయి. మరోపక్క 21వ తేదీన కూడా సమ్మె చేయనున్నట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ గురువారం ప్రకటించింది. దీంతో మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పనిసరి కానున్నాయి.