200 కోట్ల మార్క్‌కు దగ్గరగా ‘ఉరి’

vicky koushal
vicky koushal

ఉరి సెక్టార్‌లో ఆర్మీ స్థావరంపై టెర్రరిస్టులు ఎటాక్‌కి ప్రతికారంగా ఇండియన్‌ ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఉరి. బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య దార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రొన్ని స్క్రూవాలా బేనర్‌పై ఆర్‌ఎస్‌విపి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఆయనసరసన యామా గౌతమ్‌ కథానాయికగా నటించింది. చిత్రంలో విక్కీ కౌశల్‌..పాక్‌ టెర్రరిస్టులపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసే టీం కమాండర్‌చీఫ్‌ పాత్రలో కనిపించి సందడి చేశాడు. ఆ చిత్రం విడుదలై నాలుగు వారాలు ఐనప్పటికి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం 192.3 కోట్ల వసూలు రాబట్టిన ఈ చిత్రం వారాంతంలో 200 కోట్ల మార్క్‌ దాటుతుందని విశ్లేషకులు అంటున్నారు.