చైనా నుంచి ముంబయికి కరోనా వైరస్‌..?

చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లు అనుమనాలు?

chinas-coronavirus-outbreak
chinas-coronavirus-outbreak

ముంబయి: ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న దాఖాలలు కనిపిస్తున్నాయి. చైనాలో మొదలైన ఈ మహమమ్మారి చైనాలో అనేక మందిని బలిగొంది. తాజాగా ముంబయిలో కరోనా వైరస్‌ కలకలం రేగింది. చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఎయిర్‌ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని విమనాశ్రయ వర్గాలను ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైద్యాధికారి డాక్టర్‌ పద్మజ కేస్కర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ పట్ల అందరు ప్రైవేటు డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. చైనాలో విజృంభిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800కి పైగా కేసులు నమోదయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/