ఈ 18న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు

2 nd phase elections 2019
2 nd phase elections 2019


న్యూఢిల్లీ: మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కొన్ని ఒడుదుడుకుల మధ్య పూర్తయ్యాయి. ఐతే ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 18న జరగబోయే ఎండో దశ ఎన్నికలపైనే ఉంది. 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది. పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనుంది.
కర్ణాటకలో 14 చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపిలో 8, అసోం, బీహార్‌, ఒడిశాలలో 5 చోట్ల, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్మూకాశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్‌, త్రిపురలో ఒక్కోచోట రెండోదశలో పోలింగ్‌ జరుగుతుంది. యూపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుంటే ,8 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరుగుతుంది. ఈ 8 స్థానాలు బిజెపి సిట్టింగ్‌ స్థానాలే.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/