దుబాయి బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

bus accident
bus accident

అందులో 8 మంది భారతీయులు

దుబాయి: దుబాయిలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. ఒమన్‌ నుంచి దుబాయికి తిరిగివస్తున్న బస్సు మెట్రో స్టేషన్‌ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. 17 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడినట్లు దుబాయి పోలీసులు వెల్లడించారు. కాగా మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని,బాధితులకు రాయబార కార్యాలయం అండగా ఉంటుందని అన్నారు.

తాజా అంతక్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/