16బంతుల్లో అర్థ సెంచరీ

PANKAJ
PANKAJ

16బంతుల్లో అర్థ సెంచరీ
చరిత్ర సృష్టించిన పంకజ్‌ జైశ్వాల్‌

హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ డి మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన క్రికెటర్‌ పంకజ్‌ జైశ్వాల్‌ చరిత్ర సృష్టించాడు. గోవా, హిమాచల్‌ప్రదేశ్‌ జట్ల మధ్య సోమవారం ధర్మశాల వేది కగా రంజీ మ్యాచ్‌ ప్రారం భమైంది. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌ 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని సాధించాడు. తద్వారా భారత్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా పంకజ్‌ జైశ్వాల్‌ రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నిం గ్స్‌లో పంకజ్‌ జైశ్వాల్‌ 20 బంతుల్లో 7 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. దీంతో పంకజ్‌ స్ట్రయిక్‌ రేట్‌ 315గాఉంది. కాగా, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 2015లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బన్‌దీప్‌ సింగ్‌ 15 బంతుల్లోనే అర్థ సెంచరీని సాధిం చాడు. త్రిపురపై జరిగిన మ్యాచ్‌లో బన్‌దీప్‌ ఈ ఘనతను సాధించాడు. ఇక భారత్‌ తరుపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్‌ ముందున్నాడు.ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసిసి టీ20 ప్రపంచ కప్‌లో 12 బంతుల్లోనే యువరాజ్‌ అర్థ సెంచరీ సాధించాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 625/7 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం గోవా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది.