15 నుంచి 29 వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

GANTA
AP MINISTER GANTA

ఈనెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జరగనున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో  మంత్రి గంటా మాట్లాడుతూ… ప‌క‌డ్బందీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వహిస్తామన్నారు. ప్ర‌తి జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేశామని, ఫీజుల పేరుతో విద్యార్థుల‌ను ఇబ్బంది పెట్ట‌వద్దని గంటా హెచ్చరించారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,17,484 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. స‌మ‌స్యాత్మ‌క సెంట‌ర్ల‌లో సీసీటీవీలు ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.