15శాతం వృద్ధి లక్ష్యం

AP Purse App
AP Purse App

15శాతం వృద్ధి లక్ష్యం

తుళ్ళూరు: 15శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. అందుకోసం నిరంతరం పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రానైట్‌ పరిశ్రమలు,క్వారీ యజమానులు బుధవారం అమరావతి సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భ´ంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణానికి మనరాష్ట్ర గ్రానైట్‌ని వినియోగిస్తామని గ్రానైట్‌ పరిశ్రమలు,క్వారీ యజమానులకు భరోసానిచ్చారు.
రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని,పేదరికం లేని సమాజం ఆర్ధిక అసమానతలు తగ్గించటం,ఎక్కడ ఆకలి అనే మాట లేకుండా చేయడం,ఉత్తమ విద్యను అందించటం ,తదితర అంశాల్లో 17గోల్స్‌ పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఇవన్నీ 2030నాటికి సాధించాలని లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయడు పేర్కొన్నారు,

బుధవారం రాత్రి వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రాభిృద్దికి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. సేవా రంగం ద్వారానే ప్రభుత్వానికి ఆదాయమని,సేవారంగాన్ని ఇంకా అబివృద్ది చేయాలని సీఎం అన్నారు, 15శాతం వృద్ది రేటు లక్ష్యం కాగా 12శాతం మాత్రమే సాధించామని పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ది చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.హోటళ్లు, రెస్టారెంట్లు,పెరగాల్సిన అవసరం ఉందన్నారు, దీని వల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.గ్రానైట్‌ ఫెడరేషన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గ్రానైట పరిశ్రమల యొక్క ఆర్ధిక లావాదేవీలు నష్టాలపై సిఎంకు వివరించారు.సిఎం మాట్లాడుతూ దొనకొండ పారిశ్రామిక నడవలో ఔట్‌లెట్‌ దుకాణాల సముదాయానికి భూమిని కేటాయించామని ఔట్‌లెట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో ఏపి చిన్నతరహ గ్రానైట్‌ క్వారీ క్రషర్‌ పరిశ్రమ ఉత్పత్తులను వినియోగించనున్నట్లు సిఎం తెలిపారు.జీవో నెంబర్‌-37 గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.గ్రానైట్‌ పరిశ్రమకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రభుత్వంతో చర్చించాలే తప్ప సమ్మెలకు దిగడం సరైన పద్ధతి కాదని అన్నారు.పరిమిట్లు నేనే ఇప్పిస్తానని ఎవరూ పరిశ్రమలు వదిళి వెళ్ళే పరిస్థితి రాకూడదన్నారు.
గ్రానైట్‌ తూకంలో ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.డ్రోన్‌ టెక్నాలజిని వినియోగించుకోవాలని సూచించారు.డిఎంఈ తగ్గించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.చైనా,బ్రెజిల్‌,దక్షిణాఫ్రికా,జింబాబ్వే దేశాల నుంచి పోటీ ఉందని సిఎం అన్నారు.చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమలను ప్రభుత్వం విధించే టాక్సులను తెలంగాణాలో కన్నా మనరాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయన్న విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

ఈ సమావేశంలో గనులశాఖామరత్రి పీతల సుజాత,మైనింగ్‌శాఖామంత్రి శ్రీధర్‌,ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపి గ్రానైట్‌ ఇండస్ట్రీ ఛైర్మన్‌ వెంకటేశ్వరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పిహెచ్‌.రావు,వైస్‌ ఛైర్మన్‌ రాజేష్‌ అంగరా,ఆంధ్రప్రదేశ్‌ మాస్కెల్‌ గ్రానైట్‌ ఫాక్టరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.కోటేశ్వరావు,ప్రధాన కార్యదర్శి అల్లు శివరమేష్‌ రెడ్డి,ప్రతినిధులు మాటూరు కృష్ణ,జి.ప్రసాదరెడ్డి,శేఖర్‌,సీతారామయ్య,చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.