తెలుగు తెరకు అనుష్క పరిచయమై 14 ఏళ్లు

anushka shetty
anushka shetty

టాలీవుడ్‌లో అనుష్క శెట్టి పేరు తెలియని వారులేరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లోనే కాక కోలీవుడ్‌లోనూ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. తన అందంతో ,అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క తెలుగు తెరకు పరిచయమై నిన్నటికి సరిగ్గా పధ్నాలుగేళ్లు అయింది. ఈ సందర్భంగా అనుష్క ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో తన సందేశాన్ని ,తన అనుభవాల్ని షేర్‌ చేసుకున్నారు. తనకు తానుగా సినిమాల్లోకి రాలేదని, సూపర్‌ సినిమాకు పూరిజగన్నాథ్‌ తొలి అవకాశం ఇచ్చారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు అవుతుందని, తన కోసం ప్రత్యేక సమయం కేటాయించి నన్ను ఈ స్థానంలో నిలిపిన నాగార్జునకు, పూరిజగన్నాథ్‌కు మరియు తన అభిమానులకు, కుటుంబసభ్యులకు, స్నేహితులకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంది అనుష్క.