ద్రవ్యోల్భణంపై ఆర్‌బిఐ వైఖరి సరికాదు

 

ASHIMA GOYAL
ASHIMA GOYAL

ద్రవ్యోల్భణంపై ఆర్‌బిఐ వైఖరి సరికాదు

ప్రధాని సలహాదారు ఆశిమా గోయల్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 5: ద్రవ్యోల్బణంపై మితిమీరిన అంచనాలు వేసే రిజర్వ్‌బ్యాంకు ధోరణి కారణంగా వడ్డీరేట్లను అది తగ్గించలేక పోతోందని, దేశార్థిక వ్యవస్థకుకూడా అదినష్టం కలుగచేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ సలహాదారుల్లో ఒకరైన అశిమా గోయల్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై వారి అభిప్రాయం సరికాదని పిస్తుందని ఆమె అంటూ వడ్డీరేట్లను ఎక్కువగా ఉంచడం ద్వారా అది అధిక దిగుబడులు త్యాగం చేస్తోందని అన్నారు. వడ్డీరేట్లను పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనేది వారి నమ్మకమని, అయితే ఎన్నో సందర్భాల్లో అది నిజం కాదని మనకూ తెలుసని ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలిలో ఒకరైన గోయల్‌ అన్నా రు. వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ అంచనాలు తప్పని అనేక సందర్భాల్లో రుజువుకాగా, వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుం దన్న దాని భావన కూడా అనేక సందర్భాల్లో సరికాదని తేలిందని వృద్ధిరేటును సైతం అది తగ్గిస్తుందని రుజువైందని గోయల్‌ ఇటీ వల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం ్ద్ఠనాలుగుశాతానికి కాస్త అటు, ఇటుగా కొనసాగే అవకాశాలు ఉన్నం దున ఆర్‌బిఐ వడ్డీరేట్లను ఒకశాతం దాకా (100బేసిస్‌ పాయింట్లు) తగ్గించడానికి అవకాశంఉందని, భారతదేశంలో నిజానికి వడ్డీరేట్లు ఒకశాతం కన్నా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా దీనిపై పంపిన ఈమెయిల్‌కు ఆర్‌బిఐ స్పందించ లేదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి డిమాండ్‌ను అదుపుచేయ డమనే మార్గం ద్వారా వారు ప్రయత్నిస్తున్నారని, అయితే భారత్‌ లో ఈ మార్గం బలహీనంగా ఉందని, గతంలో ద్రవ్యవిధానంపై ఆర్‌బిఐ సాంకేతిక సలహామండలిలో సభ్యురాలిగా పనిచేసిన అశిమా గోయల్‌ అన్నారు.

దీనివల్ల ఉత్పత్తి తగ్గుతుందని, అన్నిం టికన్నా ముందుగా ఉత్పత్తిపైనే ప్రభావం చూపిస్తుందని అంతే కాకుండా ద్రవ్యోల్బణంపై తక్కువ ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. వినియోగం, పెట్టుబడులు మందకొడిగా ఉంటున్న నేప థ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.5శాతానికే పరి మితం కావచ్చని ఆమె అన్నారు.

2014 తర్వాత ఇంత తక్కువ ఆర్థిక వృద్ధి ఉండడం ఇదే మొదటి సారి అవుతుంది. జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో జిడిపి 6.3శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు త్రైమాసికంలో అది 5.7 శాతంగానే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న మాట నిజమే కాని, అది ఆశించిన విధంగా లేదని అశిమా గోయల్‌ అన్నారు.

డిమాండ్‌పరంగా ఇబ్బందులు కూడా ఉన్నాయని, అందువల్ల ద్రవ్యపరంగా, ఆర్థికపరంగా ఏ అవకాశాలు ఉన్నా వాటిని ఉప యోగించుకోవాలని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.

నిత్యావసర సరకుల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో కూడా అదుపులోనే ఉండవచ్చని, పప్పుధాన్యాల సరఫరా కూడా మెరుగు పడిందని, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సైతం మెరు గైందని ముడిచమురు ధరలు తక్కువగానే ఉండవచ్చన్న అంచ నాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. అయితే ఆర్‌బిఐ మాత్రం ద్రవ్యోల్బణం విషయంలో వ్యవహరించాల్సినదానికన్నా మితిమీరి చర్యలు తీసుకుంటోందని ఆమె అభి ప్రాయపడ్డారు.

ఆర్‌బిఐ అనుసరిస్తున్న కఠినధోరణి కారణంగా వినియోగంతో పాటు పెట్టుబడుల డిమాండ్‌ కూడా తగ్గిపోతుందని ఆమె అన్నారు. 2014 లో చమురు ధరలు పతనమైనప్పటి నుంచి కూడా ఈ పతనం నిలకడగా ఉంటుందని వారు నిజంగా నమ్మలే దని, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే వారు భావిస్తూ వచ్చారని కూడా వారు అన్నారు. చమురుధరలు, ఆహారధరలే మిగతా వాటికన్నా ముఖ్యంగా అధిక వడ్డీరేట్లకన్నా ఎక్కువగా ద్రవ్యోల్బ ణంపై ప్రభావం చూపిస్తాయని అనేక సందర్భాల్లో రుజువైందని కూడా ఆమె అన్నారు. నిత్యావసర సరకుల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, చమురు ధరలు కూడా నిలకడగానే ఉన్నాయని వ్యవసాయరంగంలో సంస్కరణలు ప్రారంభమైనాయని ఆమె అంటూ ఆర్‌బిఐ ఈ విషయాలను ప్రజల్లో నాటుకునే చేసి ఉండాల్సిందని, అదేజరిగి ఉంటే రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉండేదని అన్నారు.