బీహార్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

వేగంగా ఢీకొన్న కారు ట్రాక్టర్

car-tractor-collision
car-tractor-collision

బీహార్‌: ఈరోజ తెల్లవారుజామున బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముజఫర్‌పూర్‌లోని కంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి28పై జరిగిందీ ఘటన. స్కార్పియో కారుట్రాక్టర్ ఒకదాన్నొకటి వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువ మంది కారులోని వారేనని తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/