దేశలో 169కు చేరిన కరోనా వైరస్‌ కేసులు

తాజాగా చండీగఢ్ లో మరో కేసు ..మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్న వైరస్

Coronavirus India
Coronavirus India

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశలో విస్తృంగా వ్యాప్తిస్తుంది. దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యసంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ముగ్గరు మరణించగా.. మరో 15 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయినట్టు తెలిపింది. మిగతా 151 మంది దేశవ్యాప్తంగా వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది. తాజాగా చండీగఢ్ లో కొత్తగా కరోనా కేసు నిర్ధారణ అయింది. గత ఆదివారం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా ఉన్నట్టు గుర్తించారు. ఆమె వచ్చిన మరుసటిరోజే వైరస్ లక్షణాలు బయట పడ్డాయని, టెస్టులు చేయడంతో కరోనా ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆమెతో కాంటాక్ట్​ అయిన వారిని ట్రేస్​ చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న వారిని ఎయిర్ పోర్టుల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నామని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 లక్షల మందికిపైగా ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరుకుందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఒక్కరోజే కొత్తగా ఎనిమిది కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది.

తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/