కీలక వడ్డీరేట్లు యథాతథం

ముంబయి: ఆర్‌బీఐ మరోసారీ కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచింది. రెపోరేటు, రివర్స్‌ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ శుక్రవారం వెల్లడించారు.202122లో జీడీపీ వృద్ధి రేలు 10.5 శాతంగా ఉండనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది. చివ‌రిసారి గ‌తేడాది మే 22న రెపో రేటును త‌గ్గించిన రిజ‌ర్వ్ బ్యాంక్‌.. అప్ప‌టి నుంచీ ఎలాంటి మార్పులు చేయ‌డం లేదు. రెపో రేటు అంటే బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీ శాతం. ఇక రివ‌ర్స్ రెపో అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న రుణాల‌పై ఇచ్చే వ‌డ్డీ.