హోంశాఖ‌లో సూప‌ర్ న్యూమ‌రీ పోస్టులకు ప్ర‌భుత్వం అనుమ‌తి

TS Police
TS Police

హైదరాబాద్: హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. 35 అదనపు ఎస్పీ, 72 డీఎస్పీ పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్‌శాఖలో గత కొంతకాలంగా కొనసాగుతున్న పదోన్నతుల సమస్యపై ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టి తెరదించిన విషయం తెలిసిందే. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి అవకాశం కల్పిస్తామనిగతంలోనే చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు అనుమతి తెలిపింది.