హైద‌రాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

venkaiah naidu
venkaiah naidu

హైద‌రాబాద్ః ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాదు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వెంకయ్యనాయుడుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. నేడు ఏర్పాటు చేసిన పౌరసన్మానం కార్యక్రమంలో ఆయనను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి 600 మందికి ఆహ్వానం పంపారు. 11:30 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వరకు ఈ పౌరసన్మాన కార్యక్రమం జరగనుంది.