హైదరాబాద్‌ మెట్రో జాతికి అంకితం

Modi, Kcr, Ktr

హైదరాబాద్ :  మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.15 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి, మెట్రో యాప్, బ్రోచర్‌ను మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టు ఆడియో విజువల్‌ను ప్రధాని వీక్షించారు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రులు కలిసి మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు ప్రయాణించి.. తిరిగి మియాపూర్‌కు చేరుకున్నారు.