హైటెక్‌ భద్రత మధ్య సాఫీగా గణేష్‌ నిమజ్జనం

GANESH NIMAJJANAM
GANESH NIMAJJANAM

అడుగడుగునా పోలీసు పహారా, ఎక్కడికక్కడ సిసి కెమెరాల ఏర్పాటు
జియో టాగింగ్‌తో డిజి కంట్రోల్‌, సిటీ కంట్రోల్‌ రూంల నుంచి ఏర్పాట్లపై నేరుగా పర్యవేక్షణ
విధి నిర్వహణలో వుండగా గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి
ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం తొలిసారిగా మధ్యాహ్నం ఒంటి గంటకే నిమజ్జనం
ఏరియల్‌ సర్వే ద్వారా నిమజ్జన దృశ్యాలను పరిశీలించిన హోం మంత్రి, డిజిపి, సిటీ కొత్వాల్‌
హైదరాబాద్‌: జంట నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన సామూహిక వినాయక నిమజ్జనం హైటెక్‌ భద్రత, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మధ్య సాఫీగా సాగింది. మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న గణేష్‌ నిమజ్జనం వేడుకలకు పోలీసు శాఖ తొలిసారిగా ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, రెండు లక్షల 38 వేలకు పైగా సిసి కెమెరాల పర్యవేక్షణ, రెండవసారి అందుబాటులోకి వచ్చిన జియో టాగింగ్‌ పూర్తి స్థాయిలో ఫ¶లితా లను ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఓవైపు భారీ పోలీసు పహారా మరోవైపు అడుగడుగునా సిసి కెమెరాల పర్యవేక్షణ వున్నా ఏ విగ్రహం ఎక్కడ వుం దీ…? ఏ ప్రాంతాల పోలీసులు ఎక్కడ వున్నారు…? అనే అంశాలను తెలుసుకునేందుకు వాడిన జియో టాగింగ్‌ వల్ల భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ పోలీసు ఉన్నతాధి కారులకు మరింత సులభమైంది. జంట నగరాల విషయం ఇలావుంచితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిమజ్జన దృశ్యాలను ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సిసి కెమె రాల ద్వారా డిజిపి కంట్రోల్‌ రూంలోని అధునాతన వ్యవస్థ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించి స్థానిక అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనంలో భాగంగా సిద్దిపేట నుంచి నగరానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన లింబానాయక్‌ అనే ఏఎస్‌ఐ గుండెపోటుతో మరణించడంతో పోలీసుల్లో విషాదం నింపింది. కాగా ఖైరతాబాద్‌ వి నాయక విగ్రహం తొలిసారిగా మధ్యాహ్నం ఒంటి గంటకే నిమజ్జనం కావడం విశేషం. కాగా నిమజ్జన దృశ్యాలను హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, డిజిపి మహేందర్‌ రెడ్డి, సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజి నవీన్‌ చంద్‌, బల్దియా కమిషనర్‌ దాన కిశోర్‌లతో కలిసి హెలికాప్టర్‌ ద్వారా వీక్షించారు.
తెలంగాణ సర్కారు పోలీసు శాఖకు ఇచ్చిన ప్రాధాన్యత, సమకూర్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గణేష్‌ ఉత్సవాలకు మరోసారి ఉపయోగ పడింది. జంట నగ రాలలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన రెండు లక్షల 38 వేలకు పైగా సిసి టివిలు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల పోలీసుల విధి నిర్వహణ ఎంత సులభమవుతుందో గణేష్‌ ఉత్సవాలు తేటతెల్లం చేశాయి. ఇది వరకు గణేష్‌ నిమజ్జనం అంటే పోలీసులను మొహరించడం, అక్కడక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, ఏదైనా తేడా వ స్తే బల ప్రయోగం చేయడం వరకే జరిగేవి. కానీ గత ఏడాది నుంచి ఈ పరిస్థితులకు పోలీసులు చరమగీతం పాడి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది జరి గిన వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు శాఖ మొదటి నుంచి పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడడంలో విజ యం సాధించడంతో ఈ ఏడాది కూడా అదే పంథాను పోలీసులు ఎంచుకుని మరోమారు మెరుగైన ఫలితాలు అందుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో ప్రతిష్టించిన విగ్రహాలకు గత ఏడాది తొలిసారిగా జియో టాగింగ్‌ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ జియో టాగింగ్‌ వల్ల విగ్రహం ప్రతిష్టించింది మొదలు ఆ ప్రాంతంలో ఏ నిమిషం ఏం జరుగుతుందనే దానిని సిటీ కంట్రోల్‌ రూంతో పాటు డిజిపి కంట్రోల్‌ రూంలలో వున్న సిబ్బంది అనుక్షణం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఆది వారం నాటి నిమజ్జనంలో జియో టాగింగ్‌ మరింత ఉపయోగపడడంతో పాటు పోలీసుల విధి నిర్వహణ మరింత సులభతరం చేసింది. గతంలో ఒక వినాయక విగ్రహం ఎక్కడ వుం దనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడడం తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి అమల్లో వచ్చిన జియో ట్యాగింగ్‌ వల్ల కంట్రోల్‌ రూంల లోని టివి తెరలపై గణేష్‌ విగ్రహాల కదలికలను, పోలీసుల పనితీరును వీక్షించేందుకు వీలు కలిగింది. ఇదే సమయంలో పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన యాప్‌ వల్ల తమ సెల్‌ఫోన్లలో కూడా నిమజ్జనానికి వచ్చిన వినాయక విగ్రహాల కదలికలు నిరంతరం పర్యవేక్షించే అవకాశం కలిగింది. ఇతర ప్రాంతాల విషయం అలావుంచితే పాతబస్తీ పోలీసులకు జియో టాగింగ్‌ చాలా వరకు మేలు చేసిందని చెప్పాలి. వినాయక నిమజ్జనంలో పాతబస్తీ కీలకంగా వుండడం తెలిసిందే. దక్షిణ మండల పరిధిలోని అన్ని ప్రాంతాల విగ్రహాలు మొదటగా నిమజ్జనం అయ్యేందుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. అయితే జియో టాగింగ్‌ వల్ల పాతబస్తీ పోలీసులు నిమజ్జనానికి వచ్చిన విగ్రహాలను వెంటవెంటనే ట్యాంక్‌బండ్‌ వైపుకు తరలించేందుకు అవకాశం కలిగింది. జియో టాగింగ్‌ వల్ల వినాయక నిమజ్జనంపై పట్టు సాధించిన పోలీసు అధి కారులు ఇదే సమయంలో ఆయా ప్రాంతాల సిబ్బంది సరిగ్గా విధులు నిర్వహించారా…? లేదా…? అనే దానిపైనా దృష్టి సారించ కలిగారు. ప్రతీ మండపం వద్ద కేటాయించినంత సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారా…? లేదా…? అనే అంశాన్ని కూడా దీని ద్వారా తెలుసుకోగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రా ంతాలలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు కూడా ఇదే పద్దతిని ఎంచుకుని వాటిని డిజి కంట్రోల్‌ రూం నుంచి అజమాయిషీ చేశారు. కాగా ఈసారి జరిగిన నిమజ్జనంలో సిద్దిపేట్‌ నుంచి నగరానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన లింబా నాయక్‌ (54) హబీబ్‌నగర్‌ పరిధిలో విధుల్లో వుండగా శనివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆ యన్ను వెంటనే కేర్‌ బంజారాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఈ ఘటన పోలీసులో విషాదాన్ని నింపింది. కాగా ఖైర తాబాద్‌ వినాయక విగ్రహం తొలిసారిగా మధ్యాహ్నం ఒంటి గంటకే నిమజ్జనం కావడం గమనార్హం.
అడుగడుగునా పోలీసుల మొహరింపు…తొలిసారిగా 2.38 లక్షల సిసి కెమెరాల ఏర్పాటు
సిటీ కంట్రోల్‌ రూం, డిజి కంట్రోల్‌ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ
ఇదిలావుండగా గణేష్‌ ఉత్సవాలు సాఫీగా సాగేందుకు నగర వ్యాప్తంగా అడుగడుగునా పోలీసులను మొహరించారు. మొత్తం 26 వేల మంది పోలీసులను రంగంలో దించగా ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పది వేల మంది కూడా వున్నారు. పాతబస్తీలో ఐదు వేల మంది పోలీసులను మొహరించారు. వీరంతా గణేష్‌ ఉ త్సవాలు ముగిసిన తరువాత రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్ట్యా పాతబస్తీ విషయంలో పోలీసు అ ధికారులు మరిన్ని జాగ్రత్తలు చేబట్టారు. పాతబస్తీ విషయం ఇలావుంటే పశ్చిమ, తూర్పు మండల పరిధుల్లో కూడా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. నగ రంలోని సున్నిత, అతి సున్నిత ప్రాంతాలలో సాయుధ బలగాలను మొహరించారు. ఈ ప్రాంతాలలో ఉన్నతాధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా రు. ఇక ఈసారి జరిగిన గణేష్‌ ఉత్సవాలకు రెండు లక్షల 38 వేలకు పైగా సిసి కెమెరాలను నగర వ్యాప్తంగా అమర్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రెండున్నరింతల అధికం కావడవం గమనార్హం. గత ఏడాది కేవలం 15 వేల సిసి కెమెరాలు మాత్రమే వుండగా ఈసారి వీటి సంఖ్య అమాంతం పెరిగి హనుమంతుడిని తలపించింద ని చెప్పాలి. దేశంలోని మెట్రో నగరాలలో ఒక ఏడాదిలో ఇంత స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో మెజారిటి కెమెరాలు నేరుగా పోలీసు కంట్రోల్‌ రూంతో పాటు డిజిపి కంట్రోల్‌ రూంలకు అనుసంధానం చేయగా మరికొన్ని కెమెరాలను ఆయా ప్రాంతాల పోలీసు స్టేషన్లకు అనుసం ధానించారు. సిసి కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను పోలీసులు నిరంతరం పర్యక్షించారు. బందోబస్తు ఏర్పాట్లను డిజిపి మహేందర్‌ రెడ్డి, నగర పో లీసు కమిషనర్‌ ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా నిమజ్జన ఏర్పాట్లపై హోం మంత్రి నాయిని నర సింహా రెడ్డి, డిజిపి మహేందర్‌ రెడ్డి పాటు సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజి నవీన్‌ చంద్‌, బల్దియా కమిషనర్‌ దాన కిశోర్‌లతో హెలికాప్టర్‌ ద్వారా వీక్షించారు.