హెచ్‌టిసిలో భాగ‌స్వామిగా గూగుల్‌!

HTC and Google
HTC and Google

న్యూఢిల్లీః తైవాన్‌ సంస్థ హెచ్‌టీసీకి చెందిన స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో గూగుల్ భాగ‌స్వామి కానుంది. ఇందుకు 110 కోట్ల డాలర్లు (సుమారు రూ.7000 కోట్లు) వెచ్చించనుంది. కొనుగోలు ఒప్పందంలో భాగంగా హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో సుమారు 2000 మందిని గూగుల్‌ తీసుకోనుంది. వీరిలో చాలా మంది ఇప్పటికే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌పై పనిచేస్తున్నవారే. అలాగే హెచ్‌టీసీ మేధో సంపత్తి లైసెన్సు కూడా గూగుల్‌కు లభించనుంది. స్మార్ట్‌ఫోన్లతో సహా అధునాతన హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయమై గూగుల్‌కున్న నిబద్దతను తాజా ఒప్పందం మరోసారి రుజువు చేసిందని హెచ్‌టీసీ అధికార ప్రతినిధి పీటర్‌ షేన్‌ తెలిపారు. నైపుణ్యం, అనుభవంతో కూడిన వృత్తి నిపుణుల బృందం జతచేరడం వల్ల పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి అవసరమైన హెచ్‌టీసీ మేధో సంపత్తి సహకారం గూగుల్‌కు కొనసాగుతుందని చెప్పారు.