హిందూ వ్యక్తికే మా మద్ధతు: సుబ్రహ్మాణ్యస్వామి

Subrahmany swamy
Subrahmany swamy

న్యూఢిల్లీ: జమ్మకశ్మీరలో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని బిజెపి నేత వివాదస్పద నేత,ఎంపీ సుబ్రహ్మాణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి) హిందూ లేదా సిక్కు వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే తమ మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశ మాజీ ప్రధాని నెహ్రూ కశ్మీర్‌కు కేవలం ముస్లిం వ్యక్తే ముఖ్యమంత్రిగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారని,దానికి స్వస్తి పలికి హిందూ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని స్వామి అన్నారు. ముస్లిం వ్యక్తి తప్ప ఒక్క హిందూ వ్యక్తి కూడా ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదని, పిడిపి సహకరిస్తే తాము చేసి చూపిస్తామని తెలిపారు. కాగా, జూన్‌ 19న పిడిపి ప్రభుత్వం నుంచి బిజెపి మద్ధతు విరమించుకోవడంతొ సీఎం మెహాబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రస్తుతం కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించారు.