‘హిందువుల‌’ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన సుప్రీం

hindhu supreem copy
hindhu supreem

ఢిల్లీః దేశంలోని 8 రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని కోరుతూ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ అనే న్యాయవాది గ‌తంలో సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, లక్షద్వీప్‌, మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని, అయినా వారికి ఎలాంటి సదుపాయాలు దక్కడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాంకేతిక విద్యను అభ్యసించేందుకు మైనార్టీలకు కేంద్రం స్కాలర్‌షిప్పులను అందజేస్తోందని, ఈ 8 రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీ హోదా లేకపోవడంతో ఆ ఫలాలను అందుకోలేకపోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. మైనార్టీలుగా గుర్తించే అంశం జాతీయ మైనార్టీ కమిషన్‌ పరిధిలోనిదని, కమిషన్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.